నీటి విడుదల కోసం రైతుల ధర్నా
16-07-2026 02:37 PM
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): మద్యమానేర్ నుండి నీటిని విడుదల చేయాలనీ రైతులు పొత్తూర్ బ్రిడ్జి పైనా దర్బా చేశారు, ఇల్లంతకుంట మండలంలోని పొత్తూర్ బ్రిడ్జి పైనా గురువారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కన్నెపల్లి పంపు హౌస్ లు ఆన్ చేసే ఆవకాశం ఉన్న కూడా నీటిని తరలించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది అని వెంటనే ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని అన్నారు, ప్రభుత్వం నీటి విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం అన్నారు,రైతుల ధర్నా కు మద్దతు గా మాజీ జడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు మరియు బిఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.






