కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మెనూ ప్రకారం భోజనం అందించని కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెండెంట్ జీ. రవికి వినతి పత్రం అందజేశారు. బెల్లంపల్లి 100 పడకల హాస్పిటల్ లో మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గానికి పెద్దది కైనా ఈ హాస్పిటల్ ఏడు మండలాల నుండి ఎంతోమంది ప్రజలు వస్తూపోతూ ఉంటారు.
మెనూ ప్రకారం భోజనాలు అందించడం లేదని ఆరోపించారు. ఉదయం పూట అల్పాహారం ఇవ్వడం లేదని, ఇడ్లీ, పొంగల్, ఉప్మా,బ్రెడ్ ముక్కలు, కాచిన పాలు , అలాగే, మెనూలో మధ్యాహ్నం భోజనం లో, కోడిగుడ్డు అరటిపండు, పెరుగు ఉన్నా కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. రోగులకు మెనూను సక్రమంగా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. సదరు కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకొని ఆస్పత్రికి వచ్చే రోగులకు మంచి భోజనం ఏర్పాటు చేసే వేరే కాంట్రాక్టర్ ను ఏర్పాటు చేయాలని కోరారు.






