19 May, 2026 | 10:20 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన ఎమ్మెల్యే

15-02-2026 06:23 PM

– అమీర్‌పేటలో క్రికెట్ జోష్

సనత్‌నగర్,(విజయక్రాంతి): మహా శివరాత్రి సందర్భంగా అమీర్ పేట లోని మున్సిపల్ గ్రౌండ్ లో తలసాని ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి క్రీడాకారులలో జోష్ నింపారు. వివిధ కాలనీలకు చెందిన 40 టీమ్ లు పోటీలలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులు నామన సంతోష్ కుమార్ లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివ నామస్మరణ తో ఆలయాలు నిండిపోయాయని అన్నారు.

అమీర్ పేట ప్రాంతంలోని యువతను ఒకచోట చేర్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలలో గెలుపొందిన టీమ్ లకు మెమెంటోలను అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, నామన సంతోష్ కుమార్, యూత్ నాయకులు కార్తీక్, చింటు, కుమార్, అజయ్, సాయి ముదిరాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.