వెల్దుర్తి మండల అభివృద్ధి నా లక్ష్యం
విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
వెల్దుర్తి,(విజయక్రాంతి): వెల్దుర్తి మండల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు వెల్దుర్తి మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... మండల స్థాయి సమావేశాలకు అన్ని శాఖల అధికారులు సరైన పూర్తిస్థాయి సమాచారం అందించాలని శాఖల వారీగా సమస్యలు అవసరమైన పనులు వివరాలను అందిస్తే సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని అన్నారు.
ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలు ఫోన్ చేస్తే తప్పనిసరిగా స్పందించాలని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు ఆధికారులు ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించివాటిని పరిష్కరించాలన్నారు. మండల సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ పండ్లు అలాగే కొన్నిచోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయితే వాటి ద్వారా అభివృద్ధి పనులు తొందరగా చేయవచ్చని ఎమ్మెల్యే సమక్షంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... వెల్దుర్తి మండల అభివృద్ధే లక్ష్యం _ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను కచ్చితంగా గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటానని వారు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డిని వెల్దుర్తి మండల యువజన, విద్యార్థి విభాగం నాయకులు, జూనియర్ కళాశాల విద్యార్థులు, కలిసి మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
మండలానికి రూ.33 కోట్ల వ్యయంతో మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనపై ఎమ్మెల్యే వెంటనే సానుకూలంగా స్పందించి, "వెల్దుర్తి విద్యార్థుల భవిష్యత్తు కోసం నా వంతు పూర్తి కృషి చేస్తాను" అని హామీ ఇవ్వడమే కాకుండా, అందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. అంతేకాకుండా, స్థానిక నాయకులు, గ్రామస్తులు, వెల్దుర్తి–మెదక్ ప్రధాన రహదారి దుస్థితి, సరైన రవాణా సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెదక్ డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి నర్సాపూర్–మెదక్ మార్గంలో రెగ్యులర్ బస్సు సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యకు ప్రాధాన్యత... రవాణాకు భరోసా... అభివృద్ధికి అంకితభావం...
వెల్దుర్తి ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు ప్రజల తరఫున మా ప్రయత్నం నిరంతరం కొనసాగుతుంది. ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు అధికారులు నాయకులు పాఠశాల, కళాశాల, విద్యార్థులు యువత పాల్గొన్నారు.






