8 August, 2026 | 9:26 AM

వాహన తనిఖీల్లో 74 మంది పట్టివేత

08-08-2026 08:59 AM

- రూ.5.7 లక్షల జరిమానా 

సిద్దిపేట క్రైం, ఆగస్టు 7(విజయక్రాంతి) : సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 74 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపారు. సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు శుక్రవారం విచారణ జరిపి వారందరికీ కలిపి రూ. 5లక్షల 71వేలు జరిమానా విధించారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 40 మందికి కలిపి రూ.4లక్షల 5వేల 5 వందలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 34 మందికి రూ.లక్షా 65వేల 5వందలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వెల్లడించారు.