8 August, 2026 | 9:26 AM

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల నియామకం

08-08-2026 08:58 AM

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజక వర్గంలోనీ వివిధ మండలాలకు మండల పార్టీ అధ్యక్షులను  నియమించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ ప్రతిపాదనల మేరకు నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ మండల పార్టీ అధ్యక్షులుగా బెల్లంకొండ శ్రీనివాస్, గూడూరు మండల పార్టీ అధ్యక్షులుగా ధరావత్ బాలాజీ నాయక్, కేసముద్రం మండల పార్టీ అధ్యక్షులుగా చిలువేరు సమ్మిగౌడ్, ఇనుగుర్తి మండల పార్టీ అధ్యక్షులుగా బైరూ అశోక్ గౌడ్, నెల్లికుదురు మండల పార్టీ అధ్యక్షులుగా ఏదల్ల యాదవ రెడ్డి ని నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.