8 August, 2026 | 10:05 AM

లారీ ఢీకొని కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

08-08-2026 09:04 AM

బూర్గంపాడు,ఆగస్టు7,(విజయక్రాంతి):  బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్ గేట్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. వేగంగా వచ్చిన లారీ బుల్లెట్ మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.మృతుడు సారపాక మేడే కాలనీకి చెందిన మధువన్ గా గుర్తించారు. ఆయన సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో అంబిక ఫ్యాబ్రిక్‌కు చెందిన మురళి కాంట్రాక్టర్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధువన్ అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.