8 August, 2026 | 10:12 AM

కామారెడ్డి విండో చైర్మన్ గా గూడెం శ్రీనివాస్ రెడ్డి

08-08-2026 09:24 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి సింగిల్ విండో చైర్మన్ గా గూడెం శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన చిందం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు. గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. విండో డైరెక్టర్లుగా చిన్న మల్లారెడ్డి కి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణాజి గారి ఆనందరావు, టేక్  రియల్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద పోతన్న గారి రాజేష్, పాత రాజంపేటకు చెందిన గోవూరి నర్సింహారెడ్డి, గర్గులుకు చెందిన బొంబోతుల కుమార్ గౌడ్, కామారెడ్డికి చెందిన హనుమండ్ల రాజు, మామిండ్ల హనుమండ్లు, తెడ్డు ప్రమీల, జగ్గ లింగం, కనకంటి చిన్న సాయిలు, చింతల లక్ష్మీ నర్సింలు, నియామకమయ్యారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన విండో కార్యవర్గ సభ్యులు షబ్బీర్ అలికి కృతజ్ఞతలు తెలిపారు.