8 August, 2026 | 10:07 AM

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరప్రమాదం.. ఏడుగురు మృతి

08-08-2026 09:33 AM

చంబా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం టిస్సా-బైరాగఢ్ ప్రధాన రహదారిపై(Tissa-Bairagarh main road) ఉన్న చలుజ్ మోర్ వద్ద, బైరాగఢ్ నుండి చంబాకు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కకు పడిపోవడంతో డ్రైవర్, కండక్టర్‌తో సహా ఏడుగురు మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.