11-02-2026 05:51:39 PM
పాపన్నపేట: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది వారిని సత్కరించారు. వీరి వెంట నాయకులు ఉన్నారు.