ఐతురాజు పల్లిలో పశువులకు టీకాలు
13-07-2026 09:00 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతురాజు పల్లి గ్రామంలో సోమవారం కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. ఇందులో పశువులకు గుండె వాపు, జబ్బు వపు టీకాలు వేశారు. గర్భకోష వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్, ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి, విఏ రజనీకాంత్, సూపర్వైజర్ దుర్గాప్రసాద్, సెక్రటరీ అనిల్, ప్రెసిడెంట్ సంపత్ పలువురు పాల్గొన్నారు.






