13 July, 2026 | 8:15 PM

Breaking News

భూముల రీ సర్వేతో భవిష్యత్తులో వివాదాలు ఉండవు   •   జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా కోదాడ వాసి సాయిశర్మ   •   నూలు పురుగుల నివారణకై మాత్రలు పంపిణీ చేసిన చైర్మన్ రాధాకృష్ణ   •   జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి   •   బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు   •   శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   మంథని అభివృద్ధిలో మరో ముందడుగు   •   నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద నర్సింగ్ అభ్యర్థుల ధర్నా మద్దతు తెలిపిన ఆర్. కృష్ణయ్య డిమాండ్   •   చిన్నారుల ఆరోగ్యానికి నులిపురుగుల నివారణే రక్ష   •   రాజన్న ఆలయాభివృద్ధికి అమెరికా ప్రవాస కుటుంబం చేయూత   •  

శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం

11-02-2026 05:55 PM

అందజేసిన సింగిరెడ్డి పద్మారెడ్డి

ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డికి 2,16,000/-రూ. చెక్కు అందజేత

మేడిపల్లి,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి బోడుప్పల్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి 2,16,000/- రూపాయల చెక్కును ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మా రెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ లో పురాతనమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయపునర్ నిర్మాణంలో  భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమని, ప్రజలందరికీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. 

అనంతరం  బొబ్బల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  ఆలయ నిర్మాణానికి దాతల సహకారం మరువలేనిదని రెండు లక్షల పదహారువేల రూపాయలు విరాళం అందజేసిన సింగిరెడ్డి పద్మా రడ్డికి ఆలయ కమిటీ తరఫున  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు  దానగళ్ళ యాదగిరి, కొత్త కిరణ్ గౌడ్, బాల్ రెడ్డి, సత్యమూర్తి ప్రభాకర్ రెడ్డి, కీర్తన్ రెడ్డి, శ్రీహరి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.