ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి
అయిజ: గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీలోని భరత్ నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులి పురుగుల నివారణోత్సవ కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని 1 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రం తప్పకుండా వేయించాలని అన్నారు.
చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని, ఈ మాత్రల వల్ల రక్తహీనత పోషకాహార మరియు పిల్లల ఎదుగుదలకు సమస్యలను నివారించవచ్చునని అన్నారు. సోమవారం రోజు ఈ మాత్రలు తీసుకొని వారు ఈనెల 20 వ తేదీ రోజు నిర్వహించే మ్యాప్ - అప్ - డే రోజు ఈ మాత్రలు డాక్టర్ల సమక్షంలో అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్, ఎం పి హెచ్ ఈ ఓ ఓబులేసు, ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు, టిఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు.






