6 July, 2026 | 3:57 PM

Breaking News

విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •  

బడంపేటలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

24-02-2026 12:00 AM

జహీరాబాద్, ఫిబ్రవరి 23 : జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలంలో గల బడంపేట గ్రామంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాణిక్ రావు దేవాలయంలోని శ్రీ రాజన్న స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ రాజు, జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కోహీర్ మండల బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోవూరి నర్సింలు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొని డిమానికరావు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.