6 July, 2026 | 4:47 PM

ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ

06-07-2026 03:43 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ లోని వావిలాల పల్లె ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో సోమవారం హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారి లక్ష్మి చరణ్వి చేతుల మీదుగా వారి తల్లిదండ్రులు వైష్ణవి, దత్త రవితేజ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బుక్స్, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ... బాలల దినోత్సవం రోజు జన్మించిన నేను పిల్లలపై మమకారంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అలవాటుగా మారిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కే జ్యోతిలక్ష్మి, కుటుంబ సభ్యులు కృష్ణకుమారి, సతీష్ బాబు,వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.