శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం
వేములవాడ,(విజయక్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్టుకు హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శ్ చంద్రమౌళి, కమల దంపతులు 11 లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు. దేవస్థానం పీఆర్వో కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో ఎల్. రమాదేవి కి చెక్కు రూపంలో విరాళాన్ని అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రోటోకాల్ అధికారి అశోక్ కుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. "అన్నదానం మహాదానం" అనే సనాతన ధర్మ సూత్రాన్ని ఆచరిస్తూ నిత్యాన్నదాన ట్రస్టుకు ఉదారంగా విరాళం అందించిన దాతలను ఆలయ అధికారులు అభినందించి, స్వామివారి అనుగ్రహం వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.






