10 May, 2026 | 1:42 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

పదవి బాధ్యత కాదు.. ప్రజల నమ్మకం..

24-02-2026 12:00 AM

ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

జహీరాబాద్, ఫిబ్రవరి 23 : ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు బాధ్యత కాదని ప్రజల నమ్మకం ఉన్ననాడే ఆ పదవికి వన్నె వస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. వార్డులలో ఎప్పటికప్పుడు తిరుగుతూ సమస్యల పరిష్కారానికి కృషిచేసి ప్రజల మన్ననలు  పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.