6 July, 2026 | 4:45 PM

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత

06-07-2026 03:40 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను శాఖల వారీగా, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణులతో  కలసి కలెక్టర్  అర్జీల స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, చట్ట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని, లాంగ్ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

వాంకిడి మండలం తేజాపూర్ గ్రామం నగారే శ్యాంరావు అనే వ్యక్తి తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. తిర్యాణి మండలం అవలగూడ గ్రామం బుర్క వెంకటి తనకు గతంలో వస్తున్న పింఛన్ ఆగిపోయిందని, కావున తిరిగి పునరుద్ధరించాలని దరఖాస్తు చేసుకున్నారు. రెబ్బెన మండలం, వక్కులం గ్రామం శ్రీరాముల పార్వతి అనే మహిళ తమ తండ్రి గారి పేరిట గల భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించుకున్నందున తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

కాగజ్‌నగర్ మండలం అంకుశాపూర్ గ్రామం చునార్కార్ మురళీబాయి అను ఆమె తన భూమి పట్టా గురించిన సమస్యపై దరఖాస్తు చేసుకున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ రాంనగర్ (కాపువాడ) శేఖ నాబోతుమ్మ తమ కాలనీలో గల రహదారిని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేస్తున్నందున చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. తిర్యాణి మండలం భింజిగూడ గ్రామం కొవ్వ పెద్ద రాజు తమ పట్టా భూమిలో ఎలాంటి ఒప్పందం లేకుండా పాఠశాల భవన నిర్మాణం చేపట్టడంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.