20 March, 2026 | 8:35 AM

నూతన బస్‌షెల్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

20-03-2026 12:00 AM

బూర్గంపాడు,మార్చి19,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్ గ్రామ పంచాయితీ పరిధిలోని జింకలగూడెం గ్రామం వద్ద ఐటీసీ సహకారంతో నిర్మించిన నూతన బస్ షెల్టర్ ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొర్రా సుభద్ర, ఎంపీడీవో జమలారెడ్డి, ఐటిసి పిఎస్పీడీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ చెంగల్ రావు, మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మోరంపల్లి బంజర్ గ్రామ అధ్యక్షులు వీరారెడ్డి, సర్పంచ్లు కిషోర్ నాయక్, బానోత్ నరసింహ, బానోత్ పద్మ,బొల్లి నిరోషా, మాజీ ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, షేక్ షరీఫ్, సయ్యత్ సమీర్, షేక్ అబ్దుల్లా, షేక్ షబ్బీర్, షేక్ గులాం, సయ్యద్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.