11 July, 2026 | 9:50 AM

అనారోగ్యంతో ఆర్పీ మృతి

11-07-2026 08:53 AM

నస్పూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ(మెప్మా)లో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న ఒడ్నాల అరుణ(38)  అనారోగ్యంతో మృతి చెందింది. 10 ఏళ్ల క్రితం భర్త గుండెపోటుతో మరణించగా అన్ని తానే అయి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి చదువుకుంటున్న కొడుకు, కూతురు ఉన్నారు.