11 July, 2026 | 9:51 AM

అందరూ ఒక్కటఅయ్యారు.. అండగా నిలిచారు

11-07-2026 08:43 AM

బెజ్జూర్ జులై 10 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మర్దిడి గ్రామానికి చెందిన ఆత్రం మహేష్  ఇల్లు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ఇటీవల కాలిపోయింది. దీనితో ఆదివాసి సమాజం నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులు,ఆదివాసి మహిళా సంఘం నాయకులు, ఆదివాసి రాజకీయ నాయకులు, ఆదివాసి యువకులు అందరు కలిసి  వారికి మనో ధైర్యంగా 22,550 రూపాయలు  ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి సమాజం మండల అధ్యక్షులు కోరేత తిరుపతి, గౌరవాధ్యక్షులు సిడం శకారం,ఆదివాసి కొలవార్ సంఘం మండల నాయకులు ఆత్రం బక్కయ్య,మేడి సతీష్,ఆదివాసి మహిళ సంఘం అధ్యక్షులు ఏనుక అమృత, ఆదివాసి ఉద్యోగ ఉపాధ్యాయులు మడావి ధర్మయ్య, చింతపురి రాజారాం,మడావి వెంకట్రావు, మడావి హరిప్రసాద్, తలండి రాములు,పోర్శేటి పద్మ ఆలం రవితేజ,ఆదివాసి నాయకులు ఆత్రం రాజారాం,ఆత్రం గంగారాం, ఏర్మ నారాయణ,మేకల శ్యామ్ రావు, ఆలం మధుకర్,గ్రామ ఆదివాసి నాయకులు  తదితర నాయకులు పాల్గొన్నారు.