7 July, 2026 | 9:13 PM

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

07-07-2026 07:39 PM

మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సదాశివనగర్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోని,, పరియవరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఉత్తనూర్ గ్రామపంచాయతీ ఆవరణలో వన మహోత్సవం లో   భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. గ్రామంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు.పాలకవర్గ సభ్యులు తిమ్మాజీ వాడి లో వన మహోత్సవంలో  సర్పంచ్ నందిపేట భవాని సాయిలు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 లింగంపల్లి గ్రామంలో కొత్తచెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించాడానికి వచ్చిన ఎమ్మెల్యే ను సర్పంచ్  లావణ్య రమేష్  సాధారంగా పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెరువు పనులను తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తాను ఎల్లవేళలా గ్రామానికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయనహామీ ఇచ్చారు . గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.