24 April, 2026 | 8:08 PM

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

24-04-2026 06:17 PM

గుడిపల్లి,(విజయక్రాంతి): శుక్రవారం గుడిపల్లి మండలంలోని కోదండాపూరం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే కొనుగోలు సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పిస్తూ, మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తూకం నుంచి నగదు చెల్లింపు వరకు ప్రతి ప్రక్రియ వేగంగా పూర్తి అయ్యేలా అధికారులు పనిచేయాలని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.