బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.అందులో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి,ఆనంద్ నగర్,స్వరాజ్ నగర్ ప్రాంతాల్లో అత్యంత వేడుకగా నిర్వహించిన ఫలారం బండి కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వేంచేసి ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడికి తరలివచ్చిన భక్తులను ఆప్యాయంగా పలకరించి వారికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు,పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.






