14 July, 2026 | 4:22 AM

ఇందిరమ్మ గృహప్రవేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే మట్టా రాగమయి

14-07-2026 01:48 AM

సత్తుపల్లి జూలై 13 (విజయక్రాంతి): సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ లో  శ్రీరాముల లక్ష్మి, కృష్ణ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి లబ్దిదారులకు ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం  7 వ వార్డ్ కౌన్సిలర్ నసీమా, కౌన్సిలర్స్ హకీమ్, శరత్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,  స్థానిక ప్రజలు పాల్గొన్నారు.