14 July, 2026 | 4:21 AM

వజ్రేష్ యాదవ్ బండారం బయట పెడతా

14-07-2026 01:49 AM

డిసిసి అధ్యక్షుడు వజ్రెష్‌కు భేరి ఈశ్వర్ సవాల్

మేడ్చల్ అర్బన్ జూలై 13(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నుండి నాకు ఎలాంటి నోటీస్ రాలేదని గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ భేరి ఈశ్వర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎలాంటి అధికారిక సస్పెన్షన్ లెటర్ రాలేదని మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతు న్నాడని ఆయన ఆరోపించారు.మేడ్చల్ బిఆ ర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డితో వజ్రేష్ యాదవ్ చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని మల్లారెడ్డి తో వజ్జరేస్ యాదవ్ లావాదే వీలపై ఆధారాలతో సహా రాష్ట్ర కాంగ్రెస్ పా ర్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్,పిసిసి అధ్య క్షులు మహేష్ కుమార్ గౌడ్,సీఎం రేవంత్ రెడ్డి లకు ఫిర్యాదు చేస్తానని వేరే ఈశ్వర్ వెల్లడించారు.

తాను దళిత నాయకుడిని కాబట్టే తనపై వజ్రేష్ యాదవ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మంత్రి సాక్షిగా వజ్రేష్ మల్లారెడ్డికి మద్దతుగా వ్యా ఖ్యలు చేయడం ఎంతవరకు సభబని ఆయ న ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో కాంగ్రెస్ పార్టీ పరువు తీసే విధంగా వ జ్రష్ యాదవ్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ జిల్లా అధ్యక్షు నిగా కొనసాగుతున్న వజ్రెష్ యాదవ్ ప్ర తిపక్ష పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఏమి చేయలేకపోతున్నామని చెప్పడం సిగ్గుచేటని బేరి ఈశ్వర్ స్పష్టం చేశారు. అదేవిధంగా 120 మందితో ఏర్పాటు చేసిన జిల్లా కాం గ్రెస్ కమిటీతో ఇప్పటి వరకు సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన ఆరోపించారు.

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వ జ్రెష్ యాదవ్ బీసీ ముసుగులో దళిత నేతల ను ఎదిగనివ్వకుండా అనగా తొక్కు తున్నారని ఎలాంటి కుట్రలను దళితులు సహించరని ఈశ్వర్ అజ్రెష్ యాదవ్ కు సవాల్ విసిరారు.తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తన బాధను వెళ్ళగక్కుతానని ఆయన తెలియజేశారు.నాకు ఎలాంటి సస్పెన్షన్ లెటర్ లు రాలేదని తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన తెలిపారు.ఇప్పటి వరకు తనకు జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల నుండి ఎలాంటి సస్పెన్షన్ నోటీసులు రాలేదని బేరి ఈశ్వర్ చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి.కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.