28 May, 2026 | 11:54 AM

ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

28-05-2026 10:27 AM

సత్తుపల్లి, (విజయక్రాంతి): ​త్యాగానికి, భక్తిప్రపత్తులకు దైవచింతనకు నిలువెత్తు రూపం బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ అని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు  మట్టా రాగమయి దయానంద్  పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆమె హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మానవతావాదాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బక్రీద్. దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని సమాజం పట్ల త్యాగనిరతిని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. ఉన్నదానిలో లేనివారికి దానం చేస్తూ అందరి శ్రేయస్సును కోరే ఇస్లాం సంప్రదాయం ఎంతో గొప్పది. ఈ పవిత్ర పండుగ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు మరియు సోదరభావాన్ని మరింత పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.