29 April, 2026 | 9:23 PM

Breaking News

పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •   పదిలో మెరిసిన జవహర్ నగర్ పేదింటి ఆణిముత్యాలు   •   పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత   •   విధి నిర్వహణలో అలుపెరుగని శ్రామికుడికి విరామం   •   జిల్లా ద్వితీయ స్థానంలో మేకల జ్ఞానేశ్వరి   •   పదవ తరగతి ఫలితాల్లో కేజీవీబీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ   •   ఖానాపూర్‌లో కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థుల విజయపరంపర   •   డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే యువత భవిష్యత్తు సురక్షితం   •  

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

29-04-2026 07:49 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): వేసవికాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కురుమల సత్యనారాయణ ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రారంభించారు.

కుడుముల సత్యనారాయణను అభినందించిన ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వేసవి కాలంలో అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం గత 26 సంవత్సరాలుగా మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి నిదర్శనం అని కొనియాడారు.

ప్రజల దాహార్తిని తీర్చడంలో, ఆరోగ్యాన్ని కాపాడడంలో అంబలి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, నాయకులు కురుమ సాయిబాబా, తిరుపతి, గఫ్ఫార్, సామెల్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.