సుల్తానాబాద్ మండలంలో 10 ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం
సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరెపల్లి రాజయ్య
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు 11, మోడల్ స్కూల్,కస్తూరిబా బాలికల విద్యాలయం మరియు సాంఘిక సంక్షేమ పాఠశాల బాలురు మరియు బాలికలు, మహాత్మ గాంధీ జ్యోతిరావు పూలే బాలురు మరియు బాలికలు పాఠశాలల నుండి మొత్తము మండల స్థాయిలో 570 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరైనారు. వీరిలో బాలురు 300, బాలికలు 270 పరీక్షలకు హాజరైనారు. వీరిలో 291 మంది బాలురు, 266 మంది బాలికలు మొత్తం 557 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య బుధవారం తెలిపారు.
జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థి డి.సిరి వల్లిక 585 మార్కులతో ప్రథమ స్థానం లో మరియు ద్వితీయ స్థానంలో ఏ. జశ్విత 575 మార్కులతో మహాత్మా గాంధీ జ్యోతిరావు బాపూలే బాలికలు సుల్తానాబాద్, తృతీయ స్థానం కే సాక్షిత్ 573 మార్కులతో మోడల్ స్కూల్ గర్రెపల్లి మరియు బి. రామ్ చరణ్ సాంఘిక సంక్షేమ పాఠశాల బాలురు మండల స్థాయిలో ఉత్తీర్ణత సాధించారు. సుల్తానాబాద్ మండలంలో 12 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.
జడ్పీహెచ్ఎస్ రేగడి మద్దికుంట, జడ్పీహెచ్ఎస్ కనుకుల,జడ్.పి.హెచ్.ఎస్ తొగర్రాయి, ప్రభుత్వ పాఠశాల సుల్తానాబాద్, జెడ్ పి హెచ్ ఎస్ నారాయణపూర్, జడ్పీహెచ్ఎస్ సాంబయ్య పల్లి,కేజీబీవీ భూపతిపూర్, మోడల్ స్కూల్ గర్రెపల్లి ,టి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ గర్ల్స్ గర్రెపల్లి,మాత్మ గాంధీ జ్యోతి పూలే గర్ల్స్ సుల్తానాబాద్ ,మరియు మహాత్మా గాంధీ జ్యోతి రావు పూలే బాయ్స్ గర్రెపల్లి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. సుల్తానాబాద్ మండలం లోని మొత్తం విద్యార్థుల బాయ్స్ మరియు గర్ల్స్ పర్సంటేజ్ 97.72 ఇందులో బాలికలు 98.52., బాలురు 97.00 పర్సంటేజ్ తో విజయం సాదించారు. ఉత్వితమ ఫలితాలు సాదించిన విద్యార్థులందరిని మండల విద్యాధికారి ఏ.రాజయ్య , మరియు కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎస్ .రత్నాకర్ రెడ్డి, టి. దివాకర్ , వి.కవిత అభినందించారు.






