30 June, 2026 | 1:18 PM

ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

30-06-2026 12:47 PM

పోలీసులకు, ఏబీవీపీ శ్రేణులకు మధ్య తోపులాట

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బకాయిలు(Pending fee reimbursement arrears) వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఏబీవీపీ శ్రేణులు రోడ్డుపై భైఠాయించారు. ఏబీవీపీ నేతలు ఉన్నత విద్యామండలి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కార్యాలయం లోకి వెళ్లకుండా ఏబీవీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఏబీవీపీ శ్రేణులకు(ABVP cadres) మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు.