4 March, 2026 | 8:58 PM

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

04-03-2026 07:15 PM

భద్రాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భద్రాచలం(విజయక్రాంతి): ఉదాహరణ పట్టణంలోని 4 వార్డు 6 వార్డు 12వ వార్డు లలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, సర్పంచ్ పూనం కృష్ణ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణాన్ని అందంగా అవసరమైన రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినందున భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రత్నం కవితతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.