15 June, 2026 | 7:00 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

రూ.2.43 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

14-06-2026 12:00 AM

త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్ జూన్ 13 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల కోసం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ రెండు కోట్ల 43 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టి వివిధ అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన డివిజన్ల వారీగా ఆయా ప్రాంతాలలో అభివృద్ధి పనులను ప్రారంభించారు: డివిజన్ 121 పరిధిలోని తిరుమల గార్డెన్ లో రూ. 44.00 లక్షల వ్యయంతో వి డి సి సి రోడ్డు పనులకు .పద్మశ్రీ హిల్స్ లో రూ. 36.00 లక్షల వ్యయంతో యు జి డి మరియు వి డి సి సి  రోడ్డు పనులకు నర్సారెడ్డి కాలనీలో రూ. 49.00 లక్షల వ్యయంతో వి డి సి సి రోడ్డు పనులకు డాక్టర్స్ కాలనీలో రూ. 30.00 లక్షల వ్యయంతో యు జి డి పనుల కు పి అండ్ టి కాలనీ బి బ్లాక్లో రూ. 46.00 లక్షల వ్యయంతో వి డి సి సి రోడ్డు పనులకు.డివిజన్ 123 పరిధిలో శివగంగ కాలనీలో రూ. 38  లక్షల వ్యయంతో వి డి సి సి రోడ్డు పనులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించారు  కాలనీలలో అంతర్గత రోడ్లు  భూగర్భ డ్రైనేజీ  వ్యవస్థలను బలోపేతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...