గడ్డి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, ఆగస్టు 23, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గడ్డి చెరువును ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పరిశీలించారు. చెరువులో నీరు లేకపోవడంతో గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య, సింగరేణి జీఎం ఈసం కృష్ణయ్యతో కలిసి బ్పై నేరుగా గడ్డి చెరువు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఓపెన్కాస్ట్ (కెఓసీ)లో అందుబాటులో ఉన్న నీటిని గడ్డి చెరువులోకి మళ్లించేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
చెరువులోకి నీరు చేరితే రైతులకు సాగునీటి ఇబ్బందులు కొంతవరకు తొలగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్, లచ్చగూడెం సర్పంచ్ ఎదలపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






