11 May, 2026 | 7:56 PM

రేపు బస్సు సర్వీసు ప్రారంభించనున్న ఎమ్మెల్యే జారే

11-05-2026 07:12 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి నుండి పట్వారిగూడెం ములకలపల్లి వెంకటాపురం బూర్గంపాడు మీదుగా భద్రాచలం వరకు పల్లె వెలుగు బస్సు సర్వీసును ములకలపల్లిలో మంగళవారం ఉదయం 10 గంటలకు అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ప్రారంభించనున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ సోమవారం ఇక్కడ తెలిపారు. అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆదేశానుసారం మంగళవారం నుండి ఈ సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

సత్తుపల్లి నుండి పట్వారిగూడెం, అంకంపాలెం ద్వారా ములకలపల్లి, పొగళ్లపల్లి, వెంకటాపురం, బూర్గంపాడు తదితర గ్రామాలను కలుపుకుంటూ భద్రాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశానుసారం మరొక సర్వీస్ అయిన సత్తుపల్లి నుండి జగన్నాధపురం వెళ్లే పల్లె వెలుగు సర్వీస్ మార్గమధ్యలో ఉన్న జగ్గారం గ్రామానికి రాత్రివేళ, ఉదయం ఒక్కో ట్రిప్పు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సుల సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ఈ సందర్భంగా కోరారు.