ఉచిత కంటి వైద్య శిబిరంలో 80 మందికి పరీక్షలు
11-05-2026 07:08 PM
అచ్చంపేట: అచ్చంపేటలోని ప్రభుత్వ స్త్రీల ఆస్పత్రిలో సోమవారం నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ విజయ పాల్ 80 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో 42 మందిని కంటి శుక్లాలతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.
వారిని ఆపరేషన్ కోసం ప్రత్యేక అంబులెన్స్ లో కందూరు రామ్ రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. కంటి శుక్లాల చికిత్స అనంతరం వారిని తిరిగి అచ్చంపేటకు తీసుకురా అన్నట్లు చెప్పారు. శిబిరంలో అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రి విశ్రాంత ఆప్తాలమిక్ అధికారి సిహెచ్ గణేష్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






