12 May, 2026 | 3:36 PM

కొత్తపల్లి వాసుల కష్టాలు తీరుస్తా

12-05-2026 02:22 PM

బోథ్(విజయక్రాంతి): బజార్హత్నూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామస్తుల సమస్యలను పరిష్కరిస్తానని బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తిచేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామస్తుల ఇబ్బందులను విన్న ఎమ్మెల్యే త్వరలోనే బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయన్న డాక్టర్ శేఖర్ వినీల్ రవి రాజేందర్ తదితరులు ఉన్నారు.