2 July, 2026 | 2:59 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

04-05-2026 02:18 AM

నిర్మల్ మే 3 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ తో పాటు సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో జొన్న కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాల్ కి రూ. 3699/- ఉందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను అమ్మకానికి వేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులని అన్ని విధాల ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఒక వైపు చేతికొచ్చిన పంట నష్టం వాటిల్లితే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి, ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంట నాణ్యతను పక్కనపెట్టి అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు,రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.