17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

14-04-2026 01:30 AM

నిర్మల్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌తో పాటు సారంగాపూర్ మండల కేంద్రంలోని  మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాల్ కి  రూ. 2400/- ఉందని,  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను అమ్మకానికి వేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులని అన్ని విధాల ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఒక వైపు చేతికొచ్చిన పంట నష్టం వాటిల్లితే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి, ఈ ప్రభుత్వం  రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంట నాణ్యతను పక్కనపెట్టి అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల  బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.