యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్
05-07-2026 03:54 PM
బోథ్,(విజయక్రాంతి) యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఇంటికి ఊరికి ఆదర్శంగా ఉండాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరారు ఆదివారం నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం గ్రామంలో 12 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన జగదాంబ దేవి ఆలయ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... చదువుతోపాటు ఆధ్యాత్మికం అలవాటు చేసుకోవాలన్నారు. యువత చెడు అలా మాట్లాడుతూ దూరంగా ఉన్నట్లయితే గ్రామం బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉజ్వల సంపత్ తో పాటుగా గ్రామస్తులు పాల్గొన్నారు.






