17 July, 2026 | 8:54 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

మార్నింగ్ వాక్ హామీలను నెరవేర్చడమే ఎమ్మెల్యే ధ్యేయం

21-12-2025 04:59 PM

జిల్లా కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి నరసింహారెడ్డి

మర్రిగూడ,(విజయక్రాంతి): యరగoడ్లపల్లి  గ్రామస్తుల త్రాగు నీటి అవసరాలను, తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న సమస్యను గత మూడు నెలల క్రితం ఆ గ్రామంలో మార్నింగ్ వాక్ భాగంగా ప్రజల విన్నపం మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతనంగా బోర్ వెల్ ను వేయించారు. అంతేకాకుండా గ్రామపంచాయతీకి ప్రత్యేకంగా 80 కేయూ, త్రీ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ ను మంజూరు చేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు పులిమామిడి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మోటార్ ను బిగించి, ట్రాన్స్ఫార్మర్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెసు పార్టీ అద్యక్షులు రామదాసు శ్రీనివాసు, వార్డు మెంబర్లు, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు , తాజా  మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.