17 July, 2026 | 9:01 PM

Breaking News

రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •  

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

21-12-2025 05:02 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని చందారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ రామాంజనేయులు గుండె పోటుతో మృతి చెందాడంతో మృతిని కుటుంబానికి మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ఆదివారం ఆర్థిక సహాయం  అందించినట్లు మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల  సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోట పలుకుల సత్తయ్య పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భవిష్యత్తులో కూడా మంచిర్యాల జిల్లాలో సుమారు 423 మంది రేషన్ డీలర్లు ఉన్నారని ఎవరికైనా ఆపద వస్తే వారి కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండి ఆర్థిక సహాయం చేస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆసాది సుధాకర్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, మంచిర్యాల మండల అధ్యక్షుడు మహేందర్, దండేపల్లి మండలం అధ్యక్షుడు మల్లేష్ , రేషన్ డీలర్ సలీం, లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.