ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు
27-08-2026 04:36 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ‘నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనం దేశానికి, ధర్మానికి, సంస్కృతికి రక్ష’ అంటూ సంకల్పం చేసి ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. పూర్వ ఆచార్యులు శ్రీరామ్ సత్యనారాయణ రక్షాబంధన్ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు కలెక్టరేట్, ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ డిపో, పోలీస్ బెటాలియన్ తదితర ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టారు. కలెక్టర్ కె హరిత,ఎమ్మెల్యే కోవ లక్ష్మి,మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ తో పాటు పలువురికి రాఖీలు కట్టారు.






