28 May, 2026 | 4:40 AM

వనదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

28-05-2026 12:41 AM

ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు

పాపన్నపేట, మే 27: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శివాని దంపతులు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది వారిని సత్కరించారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, స ర్పంచులు, నాయకులు, సిబ్బంది ఉన్నారు.