7 August, 2026 | 4:48 PM

Breaking News

వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   డీసీఎంను ఢీకొన్న ద్విచక్రవాహనం   •   గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్న మాజీ జెడ్పిటిసి   •  

నైతినికి ఎమ్మెల్యే అభినందనలు..

13-06-2026 12:45 AM

భిక్కనూర్, జూన్ 12 (విజయక్రాంతి): ఇటీవల నిర్వహించిన చిల్డ్రన్ మాక్ పార్లమెంట్లో భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నైతిని మాట్లాడిన తీరు పట్ల కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మద్యపాన నిషేధం వల్ల కుటుంబాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నైతిని చెప్పిన అంశం అభినందనీయమని అన్నారు.

ప్రతి విద్యార్థి సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలను తెలియజేస్తూ తన బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. నైతిని భవిష్యత్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నైతిని తల్లిదండ్రులు, బీజేపీ గ్రామ అధ్యక్షుడు మీసాల ప్రవీణ్, సేవారత్న అవార్డు గ్రహీత మోహన్ రెడ్డి పాల్గొన్నారు.