22 July, 2026 | 3:51 AM

పార్కును కాపాడాలని ‘హైడ్రా’ కమిషనర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు

22-07-2026 12:00 AM

ఎల్బీనగర్, జూలై 21 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పార్కులను అభివృద్ధి చేసి, కాపాడాలని హైడ్రా అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. బైరామల్ గూడలోని శ్రీవేంకటేశ్వర కాలనీలో ఉన్న పబ్లిక్ పార్కును ఆక్రమణల నుంచి రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని మంగళవారం హైడ్రా కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... బైరామల్ గూడలోని శ్రీవేంకటేశ్వర కాలనీలో ఉన్న పబ్లిక్ పార్కు అభివృద్ధి కోసం దాదాపు రూ.12 లక్షలు మంజూరు చేశానన్నారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్,అందమైన మొక్కలను నాటించినట్లు గుర్తు చేశారు. కాగా, ఇటీవల కొందరు పార్కులో అక్రమంగా నిర్మాణాలను చేపడుతున్నారని, నిర్మాణాలను తొలగించి పార్కును పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయాలని కోరారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ...  రెండు రోజుల్లో హైడ్రా సిబ్బందిని పంపించి  పార్కును పరిశీలించి, అక్రమ నిర్మాణాలను తొలిగించి, ప్రజలకు అందుబాటులోకీ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, కాలనీ అధ్యక్షుడు అమృత రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలస్వామి, కోశాధికారి అనంతరెడ్డి, గౌరవ సలహాదారులు విశ్వనాధం, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, సభ్యులు శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.