19 June, 2026 | 4:53 AM

మియాపూర్ సర్కిల్- కొత్త ఉప కమిషనర్‌గా శ్రీనివాస్ నియామకం

19-06-2026 02:19 AM

శేరిలింగంపల్లి, జూన్ 18 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మియాపూర్ సర్కిల్కు కొత్త ఉప కమిషనర్గా జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈనెల 30న పదవీ విరమణ చేయబోతున్న శశిరేఖ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న జి.శ్రీనివాస్ను మియాపూర్ సర్కిల్  48 ఉప కమిషనర్గా బదిలీ చేస్తూ కమిషనర్ జి. శ్రీజన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే శశిరేఖ నుంచి ఛార్జ్ తీసుకుని ఆయన విధులు చేపట్టనున్నారు.

అనుభవజ్ఞులైన అధికారి జి.శ్రీని వాస్ గతంలో జీహెచ్‌ఎంసీలో జాయింట్ కమిషనర్గా, మిర్యాలగూడ మున్సిపాలిటీ కమిషనర్గా విధులు నిర్వహించిన రికార్డు కలిగి ఉన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత పిఆర్‌ఓగా బాధ్యతలు చేపట్టారు.

మియాపూర్ సర్కిల్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ఆయన దృష్టి సారించనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ బదిలీతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనలో మరింత చురుకైన వ్యవస్థ ఏర్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.