24-02-2026 12:11:39 AM
నవాబ్‌పేట్, ఫిబ్రవరి 23: కాలేజ్‌కి వెలి వస్తానని చెప్పిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన నవాబ్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నవాబ్ పేట్ ప్రాంతానికి చెందిన అఖిల్ (17) శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కాలేజ్ కి వెళ్లి తిరిగిరాలేదు.
కాలేజ్ టైమ్ అయిపోయిన ఇంటికి తిరిగి రాకపోవడం తో ఎన్మంగండ్ల జూనియర్ కళాశాల కు వెళ్ళి అడగగా శనివారం అసలు కాలేజ్ కి రాలేదని కాలేజ్ సిబ్బంది తెలియజేయడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అతడి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు.దీంతో అతడి తండ్రి రాజు నవాబ్ పేట్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు