16 May, 2026 | 8:14 PM

గులాబీ గూటికి చేరిన మైనారిటీ నాయకుడు ఖాజా భక్ష్

16-05-2026 07:17 PM

మైనార్టీలకు ప్రాముఖ్యత లేని కాంగ్రెస్ పార్టీ

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదని ఖాజా భక్ష్ అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్ష పదవిని వదిలి,శుక్రవారం రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మైనార్టీలకు గౌరవం దక్కాలంటే బి.ఆర్.ఎస్ తోనే సాధ్యమన్నారు. త్వరలో తనతో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలను కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రానున్నారని చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.