14 August, 2026 | 8:23 PM

Breaking News

సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •  

చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

14-08-2026 07:47 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చందూరు మండలంలోని మేడిపల్లి తండా, లక్ష్మీ సాగర్ తండా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన తన చేతుల మీదుగా ప్రారంభించారు.మేడిపల్లి గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం మేడిపల్లి నుంచి లక్ష్మీ సాగర్ వరకు SDF నిధులు రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే లక్ష్మీ సాగర్ నుంచి వ్యవసాయ పంట పొలాలకు వెళ్లేందుకు SDF నిధులు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్డు, లో లెవెల్ వంతెనను కూడా ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు.