14 August, 2026 | 8:38 PM

Breaking News

ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం   •   సరస్వతి నగర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన   •   మిఠాయి భండార్ తయారీ యూనిట్‌పై ఎస్ఓటి దాడి   •   రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు అండగా నిలవాలి   •   80వ స్వాతంత్య దినోత్సవం సందర్బంగా 80 ఆకారంలో పినాకిల్ పాఠశాల విద్యార్థులు   •   సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •  

శ్రావణమాసం... కాళేశ్వరంలో భక్తుల సందడి

14-08-2026 07:40 PM

కాళేశ్వరం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదిపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ  కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయ బాలాలయంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరి తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ బాలాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు కాలసర్ప, శని దోష నివారణ పూజలు నిర్వహించుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన సేవలను అందించారు.